29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

. . . జిల్లా ఎన్నికల అధికారి టి .వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ విధులలో నిమగ్నం అయి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఎంపీడీఓ కార్యాలయాలలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు సంబంధిత మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాలల్లో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులందరూ ఈ నెల 9 వ తేదీ లోపు సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా, రెండవ దశలో ఎన్నికలు జరుగనున్న ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి మాక్లూర్ మోపాల్ నిజామాబాద్ సిరికొండ జక్రాన్పల్లి మండలాల్లో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు ఈ నెల 10 నుండి 12వ తేదీ లోపు సంబంధిత మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మూడవ దశ ఎన్నికలు జరగనున్న ఆలూర్, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాలలో ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో డిసెంబర్ 13 నుండి 15వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగులు తమకు విధులు కేటాయించిన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో నిర్ణీత తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని ఓటు వేయాలని కలెక్టర్ సూచించారు.

More articles

Latest article