
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ఏర్పాటు చేసిన సీఎంఆర్ వస్ర్త, ఆభరణాల షోరూమ్ ను ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఎంపీ అర్వింద్ రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఎంపీతోపాటు ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు. షోరూం లోని వస్ర్తాలు, ఆభరణాలను పరిశీలించారు. అతిపెద్దదైన సీఎంఆర్ జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు.
రామ్, పాయల్ రాజ్ పుత్ సందడి
ప్రముఖ వస్త్ర, జ్యుయెలరీ షాపింగ్ మాల్ సీఎంఆర్ ప్రారంభోత్సవానికి హాజరైన సినీ హీరోహీరోయిన్లు రామ్, పాయల్ రాజ్ పుత్ ఇందూరు నగరంలో సందడి చేశారు. వారిని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. రామ్, పాల్ రాజ్ పుత్ తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహానికి అవధులు లేకుండాపోయాయి.


