24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు లక్మన్ అన్నారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్ధిని అన్ని విషములలో అవగాహన కలిగి ఉండే విధముగా తయారు చేయాలని తెలియజేశారు. అనంతరం పదోన్నతి పై మోర్తాడ్ మండలం లోని శేట్ పల్లీ ప్రాథమిక పాఠశాల నుంచి ముప్కాల్ మండలంలోని నల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ కు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిరణ్ కుమార్, ఉపాధ్యాయురాలు సుమతీ, కరుణ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్, మౌనమీ, సూర్యమ్మ,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article