వెబ్ న్యూస్, బతుకమ్మ : ఇంగ్లండ్లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో జైస్మీన్ లాంబోరియా ఛాంపియన్ గా నిలిచింది. స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. లివర్పుల్లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు. భారత్ తరఫున మీనాక్షి హుడా ( 48 కేజీలు), నుపుర్ షెరోన్ (80 కేజీల పైన) ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం లేకుండానే పోటీని ముగించింది.
