27.2 C
Hyderabad

ఏకగ్రీవంగా ఆమోదం పొందిన మున్సిపల్ చట్ట సవరణ బిల్లు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో రెండో రోజు శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పెన్ డ్రైవ్ లో అందజేశారు. పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్ మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది. తెలంగాణ పురపాలక చట్టం 2019 నిబంధన సవరణ బిల్లుపై శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ చర్చ జరగుతున్నందున ఆర్డినెన్స్ కుదరదని తెలిపారు. చర్చల అనంతరం మున్సిపల్‌ చట్టసవరణ బిల్లును అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఆమోదించింది.

More articles

Latest article