- టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకుమ్మ : ఉద్యోగుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ ,టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. టీఎన్జీవో అత్యవసర జిల్లా సర్వసభ్య సమావేశం టీఎన్జీవో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహదినం గా భావించి, ఆరోజున ఆయా జిల్లాల ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో… అన్ని జిల్లాలలో ఐడీఓసీ కార్యాలయల ముందు, నల్ల బ్యాడ్జీలు ధరించి, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనంతరం హైదరాబాద్ లలిత కళాతోరణం నందు రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీపీఎస్ అంతం కొరకు ఏర్పాటుచేసిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి తరలి రావాలని కోరారు. అనంతరం ఉద్యోగుల హక్కుల సాధన కొరకు జిల్లాల పర్యటనలో భాగంగా బస్సు యాత్ర గా సెప్టెంబర్ 11వ తేదీన జిల్లా కేంద్రానికి విచ్చేయుచున్న జేఏసీ రాష్ట్ర నాయకులను సాధారణ ఆహ్వానించాలన్నారు. ఎంప్లాయిస్ జేఏసీ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో, నిర్వహించ తలపెట్టిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభకు ప్రతి ఉద్యోగి ఉద్యమ స్ఫూర్తితో విచ్చేసి, కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, నిజామాబాద్ అర్బన్ యూనిట్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశికాంత్ రెడ్డి, ఎస్ అండ్ ఎల్ఆర్ Spl.యూనిట్ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఎస్ఆర్ఎస్పీ యూనిట్ కార్యదర్శి సాయి కృష్ణ, నిజాంబాద్ రూరల్ అధ్యక్షులు జ్ఞానేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యు వివిధ శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు… అతిక్ అహ్మద్, బి.శ్రీనివాస్, పురుషోత్తం, శివకుమార్, మంజుల, జాఫర్ హుస్సేన్, మహేందర్, విశాల్, పార్థసారథి, శ్రీరాములు, గంగరాజు, ఇందిర,రాజేశ్వర్, ప్రకాష్, విజయలక్ష్మి, సునీల్, స్వామి, సంధ్యారాణి, శ్రీప్రియ, రాజ్ కుమార్, సురేష్ ,తిరుపతి ,టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ గారు, క్లాస్ ఫోర్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
