30.2 C
Hyderabad

వర్షానికి తడిసిన రేషన్ బియ్యం

Must read

📰 Generate e-Paper Clip

  • తడిసిన బియ్యాన్ని రేషన్ దారులకు పంపిణీ చేయవద్దు
  • తహశీల్దార్ తారాబాయి

 

రుద్రూర్, బతుకమ్మ : కురిసిన భారీ వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గల రేషన్ షాపు, అంగడి బజార్ లో ఉన్న రేషన్ షాపులో సుమారు 15 క్వింటాళ్ళ రేషన్ బియ్యం మొత్తం తడిసి ముద్దయింది.  కురిసిన వర్షానికి రేషన్ దుకాణాలు ఊరుస్తుండడంతో  బియ్యం బస్తాలు తడిసిపోయాయి. ఈ రేషన్ బియ్యాన్ని గ్రామంలోని రైతు వేదిక ప్రక్కన గల ఫంక్షన్ హాల్ లో ఆరబోసారు. వర్షానికి తడిసి ఆరబోసిన రేషన్ బియ్యాన్ని రేషన్ దారులకు పంపిణీ చేయవద్దని తహశీల్దార్ తారాబాయి రేషన్ డీలర్ కు ఆదేశించారు.

More articles

Latest article