27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

సింగర్ సీతకు అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో తన పాటలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న సింగర్ సీతకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతియేటా అందజేసే అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డు – 2025 పురస్కారాన్ని సింగర్ విభాగంలో అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖ అధికారుల ప్రోత్సాహంతో జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి పోలీస్ కళాబ్రుందంతో కలిసి పాటలతో, మాటలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఈ పురస్కారం వరించిందని తెలిపారు.

More articles

Latest article