25.7 C
Hyderabad

అవినీతి అన్యాయాలపై పోరాడుదాం

Must read

📰 Generate e-Paper Clip

. . . యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, నూడ చైర్మన్ కేశ వేణు,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరాల రత్నాకర్ హాజరయ్యారు.  యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్  గౌడ్ యూత్ కాంగ్రెస్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  యూత్ కాంగ్రెస్ అతిపెద్ద ప్రజాస్వామ్య యువజన సంఘం అని ,యూత్ కాంగ్రెస్ అనేకమంది సమర్థవంతమైన క్రమశిక్షణ కలిగిన జాతీయ , రాష్ట్ర నాయకులను తయారుచేసిందని, యూత్ కాంగ్రెస్ తయారుచేసిన నాయకులు భారతదేశం అభివృద్ధికి బాటలు వేశారని యూత్ కాంగ్రెస్ అంటే క్రమశిక్షణకు పోరాటానికి త్యాగానికి మారుపేరని ఆయన అన్నారు. మత తత్వ విద్వేష బీజేపీని కేంద్రంలో గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. యూత్ కాంగ్రెస్ లో పనిచేయడానికి యువ గొంతులు మాతో కలిసి రావాలని, అన్యాయం, అవినీతి, విద్వేషానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలన్నారు. .ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ నాయకులు  రామ్మర్తి గోపి, జెండా బాలాజీ ఆలయ చైర్మన్ లవంగం ప్రమోద్ ,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షు లు అనుపాల్ కిరణ్ , ఎండి అద్నాన్ , జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆదిత్య పాటిల్, నరేందర్ గౌడ్, ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article