25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అస్తవ్యస్థంగా మురికి కాలువలు

Must read

📰 Generate e-Paper Clip

  • పట్టించుకోని అధికారులు

 

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ మందిరం వద్ద మురికి కాలువలు అస్తవ్యస్థంగా మారాయని, మురికి కాలువల్లో చెత్త చెదారం పేరుకుపోవడంతో మురికి నీరు రోడ్డు పై ప్రవహిస్తుందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులను విన్నవించినా  పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మురికి కాలువ ప్రక్కనే నీటి కుళాయి ఉందని, మురికి కాలువలను శుభ్రపర్చకపోవడంతో నీటి కుళాయి వద్దకి మురికి నీరు చేరడంతో త్రాగు నీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేయించాలని కాలనీవాసులు కోరారు.

Dirty sewers in disarray

More articles

Latest article