నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్టలో గల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు 49వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రాంగణంలో భాగంగా మొక్కలు నాటారు. మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అని, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడుగుజాడలో నడిచిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి కేటీఆర్ అని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని సుఖశాంతాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శిర్పరాజు మాజీ ప్రభాకర్ మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

