25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : అప్పుల బాధ భరించలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం  వల్లభపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ ఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం మేకల హన్మాండ్లు అనే వ్యక్తి అప్పుల బాధ ఎక్కువ కావడంతో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పంట పొలాలలో ఉపయోగించే పురుగుల మందు త్రాగగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించిగా  చికిత్స పొందుతూ  మరణించినట్లు ఆయన తెలిపారు. మృతుడి భార్య మేకల గంగామణి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article