27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బాన్సువాడలో కత్తిపోట్ల కలకలం

Must read

📰 Generate e-Paper Clip

 ఒకరి పరిస్థితి విషమం

బాన్సువాడ, బతుకమ్మ: మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు  కత్తులతో దాడి చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి బాన్సువాడలో కలకలం రేపింది. పట్టణంలోని   తాడ్కోల్ చౌరస్తాలో గల బార్ వద్ద  సోనుసింగ్, సంజీవ్ ల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. సోను సింగ్ తల్వార్ తో ఆటో డ్రైవర్ సంజీవ్ పై దాడి చేశాడు. వెంటనే  స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంజీవ్ ను హుటాహుటీన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నిజామబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

A stabbing incident in Bansuwada

More articles

Latest article