30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

దుర్గామాత ఆశీస్సులు అందరికీ ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి.

 

బతుకమ్మ, బాన్సువాడ : దుర్గామాత తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో జరిగిన దుర్గామాత బోనాల ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు మంత్రి గణేష్,మాజీ ఎఎంసి చైర్మన్ పాత బాలకృష్ణ,బాడీ శ్రీనివాస్, యూనుస్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article