24 C
Hyderabad
Sunday, August 2, 2026

అక్రమ ఇసుక రవాణా : లారీ స్వాధీనం, ఇద్దరి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ :  బోధన్ నుంచి నిజామాబాద్ వైపు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, బోధన్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న TS 16 TE 5037 నంబర్ గల లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. తనిఖీలో ఏవిధమైన ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.  లారీ ఓనర్ అజీజ్, డ్రైవర్ సిరాజ్‌ను అదుపులోకి తీసుకొని, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారిని ఎడపల్లి  పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.

More articles

Latest article