నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే పరిధి లోని నిజామాబాదు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం 2మీద శ్రీ ఆచార్య వేద మిత్ర ప్రముఖ యోగ శిక్షకుల పరివేక్షణ లో రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఔత్సహికులు వివిధ విభాగములకు చెందిన రైల్వే సిబంది యోగ శిక్షణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లొ శ్రీ ఆచార్య యోగ మిత్ర వివిధ రకాల యోగ సాధన విధానాలను ప్రయోగత్మకంగా సాధకులకు నేర్పించారు. ఈ సందర్బంగా శ్రీ సంఘ మిత్ర మాట్లాడుతూ నిత్యం యోగ సాధన ద్వారా మానసిక ఆనందం, శారీరక ఆరోగ్య కలుగుతుందని, యోగ సాధన ద్వారా ఆధ్యాత్మిక కలుగుతుంది అని తెలిపారు.
