- లారీని ఢీ కొట్టిన డీసీఎం
- టోల్ ప్లాజా సమీపంలో ఘటన
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న లారీని అదే వైపు నుండి వస్తున్న డీసీఎం అతివేగంతో వచ్చి లారీని ఢీకొట్టాడు. డీసీఎం డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోవడంతో టోల్ ప్లాజా సిబ్బంది జిఎంఆర్ పోలీసులు డ్రైవర్ ని తీసి జిఎంఆర్ అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించారు.

