28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మేకల దొంగ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాక్లూర్ : మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో మేకల దొంగను గ్రామస్తులు పట్టుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామంలోని మేకల మంద వద్దకు వచ్చిన దుండగుడు మేకలు ఎత్తుకెళ్లే ప్రయత్నంలో గ్రామస్తుడు గంగన్న చూసి అరవడంతో బైక్, మేక వదిలేసి పారిపోయాడు. మరో బండిని దొంగలించి అల్వాపూర్ గ్రామంలోని మరో మేకలు ఎత్తుకెళ్లి సమయంలో వల్లభాపూర్ గ్రామ శివారులో పట్టుబడ్డాడు. దొంగను వివరాలు అడగగా టేకు ప్రశాంత్ నందిపేట్ నాగపంచ కాలనీకి చెందినవాడని తెలిపారు. గత నాలుగు సంవత్సరాలు నుంచి గొర్రె మేకలను దొంగలించి నవీపేట్ లో తనతో సంబంధం ఉన్న మటన్ వ్యాపారస్తులకు అమ్ముతున్నాడని గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మాక్లూర్ పోలీస్ స్టేషన్ తరలించారు.

More articles

Latest article