26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నాలుగు రాష్ట్రాల్లో మోదీ.. జమ్మూకశ్మీర్ లో అమిత్ షా పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజులపాటు సిక్కిం, బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్‌దువార్‌లో గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయడంతోపాటు బీహార్‌ కరకట్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నగర్‌లో రూ.20,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తారు.

జమ్మూకశ్మీర్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం పర్యటించనున్నారు. ఎల్జీ, ఆర్మీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్న ఆయన.. అమర్‌నాథ్‌ యాత్ర భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తారు.

More articles

Latest article