నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ మీసేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రమాణస్వీకారం ఉత్సవం, దశమ వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ షామీర్పేట్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవము రాష్ట్ర అధ్యక్షులు బత్తుల జీవన్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కిరణ్, రాష్ట్ర కోశాధికారి జి శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కే. లక్ష్మీనారాయణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మహమ్మద్ నాసిర్ అహమ్మద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కే.లక్ష్మీనారాయణ రాష్ట్ర మీ సేవ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో వర్కింగ్ ప్రెసిడెంట్గా, 8 జిల్లాల బాధ్యతలు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, అదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, మెదక్ జిల్లాల బాధ్యతలు అప్పగించి నియమించిన రాష్ట్ర అధ్యక్షుడికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గానికి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మీసేవ మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నుండి చింత రాజు, ముజాహిదుద్దీన్ అన్సారి, గోపాల్, సంతోష్ పాల్గొన్నారు.
14523


