బతుకమ్మ,మాక్లూర్ : మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారా అయితే మీరు జైలుకి వెళ్లాల్సిందే అంటున్నారు మాక్లూర్ పోలీస్ సిబ్బంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు మాక్లూర్ మండల పరిధిలోని ఇటీవలే మద్యం త్రాగి వాహనాలు నడుపుతున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో గంగాధర్ ముందు వాసి, పరమేశ్వర్ మామిడిపల్లి వాసి సంతోష్ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేషన్స్ ఆఫ్ సెకండ్ క్లాస్ నందు ఒకరికి రెండు రోజులు, మరొకరికి మూడు రోజుల జైలు శిక్షణ విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠినంగా చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన ఎడల అలాగే మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మండల ప్రజలకు హెచ్చరించారు.
