హైదరాబాద్, బతుకమ్మ : రాజ్ భవన్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్ భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను గవర్నర్ కు సీఎం రేవంత్ వివరించనున్నారు. ఈభేటీకి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
