25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

శ్రీరామ్ సాగర్ కు భారీ వరద

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ ,బాల్కొండ : ఉత్తర తెలంగాణ వరప్రదాయాని శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తు తోంది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత తొలిసారి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 50వేల క్యూసెక్కులను దాటింది. శనివారం తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడడంతో నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో వర్షాలు, మంజీరా గోదావరి నదులకు వరదరావడంతో భారీగా వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఉదయం ప్రాజెక్టులో 31 వేల క్యూసెక్కులతో వరద ప్రారంభం కాగా రాత్రికి 80 వేల క్యూసెక్కులను చేరుకుంది. ఉదయం ప్రాజెక్టులో 62 టీఎంసీల మీరు నిల్వ ఉండగా సాయంత్రానికి 64 టీఎంసీలకు చేరుకుంది ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యం 80 టీఎంసీలు కాగా మరో పదహారు టీఎంసీలు మీరు వస్తే ప్రాజెక్టు నిండిపోతుంది. ప్రాజెక్టుకు లక్షక్యూసెక్కుల వరద కంటిన్యూగా వస్తే మాత్రం రెండు మూడు రోజుల్లోనే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని గేట్లు ఎత్తడం ఖాయంగా ఉంది.

More articles

Latest article