27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వ్యాపారస్తులకు ఒక రోజు జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వ్యాపార సమయం దాటిన తర్వాత కూడా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. నగరానికి చెందిన షా గౌస్ యజమాని షేక్ గౌస్ పాషా, ఖురేషీ హోటల్ యజమాని అన్సార్ హుస్సేన్ లను బుధవారం జిల్లా స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జీ ముందు హాజరు పరచగా వారికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇద్దరిని జైలుకు పంపించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా వ్యాపార సమయం తరువాత షాప్ లు, హోటల్ లు, మరే ఇతర షాప్ లు తెరిచినచో వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article