బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో గల అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీహరి రాజు మాట్లాడుతూ ప్రస్తుతం రోజురోజుకు ఎండ ఎక్కువ అవుతున్నందున పాదాచారులకు వాహనదారులకు దాహం తీర్చేందుకు తమ వంతు బాధ్యతగా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సతీష్ పలువురు పాల్గొన్నారు.
