30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నందిపేటలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

నందిపేట్, బతుకమ్మ :  మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు నిర్వహించాయి.  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమర్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ రుణాల బిల్లులను అసెంబ్లీ లో ఆమోదం తెలిపినందుకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో అంబేడ్కర్  విగ్రహానికి పూలమాల వేసి నాయకులు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ మైనార్టీ, ఎస్సీ సెల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article