25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వినియోగదారుల వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల వారోత్సవాల పోస్టర్లను నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇందూరు వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఏఎంసీ కార్యాలయంలో వినియోగదారుల హక్కుల చైతన్య కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెలక్షన్ గ్రేడ్ సెక్రెటరీ ఎన్ అపర్ణ  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ క్రియాశీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెందుట అనిల్ కుమార్,  సందు ప్రవీణ్, సంయుక్త కార్యదర్శి మహాదేవుని శ్రీనివాస్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు పౌడపెల్లి అనిల్, రూరల్ డివిజన్ అధ్యక్షులు యాటకర్ల దేవేశ్, గైని రత్నాకర్, వియాన్ వర్మ, రాజుల రామనాథం, ప్రవళిక, గడప రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article