25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కల్వర్టుల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ మున్సిపల్ పరిధిలో వివిధ వార్డులలో గల కల్వర్ట్లను సోమవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ వెంకట్ నారాయణతో కలిసి పర్యవేక్షించారు. వార్డ్ నెంబర్ 5లో గల తాసిల్దార్ ఆఫీస్ వెనకాల గల కల్వర్టు ను, షర్బత్ కెనాల్ కల్వర్టును, వార్డ్ నెంబర్ 35 అఖిల్ కిరాణా వద్దగల కల్వర్టును, వార్డ్ నెంబర్ 9 క్వాడ్రి కాలనీ కల్వర్టును, బెలాల్ ట్యాంక్ ను తదిత వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై అధికారులతో మాట్లాడుతూ, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు డీఈ, ఏఈ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
Inspection of culverts

More articles

Latest article