27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజావెంకట రెడ్డి తెలిపారు.  పోలీసుల కథనం ప్రకారం.. డిచ్ పల్లి మండలంలోని మెంట్రాజ్ పల్లి గ్రామ జంక్షన్ వద్ద డిచ్ పల్లి సీఐ మల్లేష్, ఎస్ఐ వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరబాద్ వైపు ద్విచక్ర వాహనాలపై వస్తున్న ఇద్దరిని తనిఖీ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించి గంజాయి విక్రయించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు మెబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, 900గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా గంజాయి విక్రయించినా, తాగినా చట్టరీత్యా నేరమని అన్నారు.

More articles

Latest article