- పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి జి.సురేష్
కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ విద్యారంగానికి కనీసం ఓ ప్రత్యేక శాఖను నియమించకుండా జాప్యం చేస్తూ విద్యారంగాన్ని గాలికి వదిలేసి కేసిఆర్ అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి ప్రయాణం చేస్తున్నాడని పిడియస్యూ రాష్ట్ర కార్యదర్శి జి.సురేష్ విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందన్నారు. ఎటువంటి పట్టింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామమాత్రంగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నదని ఆరోపించారు ఒకపక్క గురుకుల విద్యాలయాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు మరణిస్తుంటే మరోపక్క ప్రభుత్వ విద్యాసంస్థలన్నీంటిలో అర కొర సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వ చేయూత ఏమాత్రం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేటాయించిన బడ్జెట్ విద్యాసంస్థల నిర్వహణకు ఉద్యోగుల జీతపత్యాలకు కూడా సరిపోని స్థితి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సతీష్, శ్రీకాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
