బోధన్, బతుకమ్మ : కారును అతివేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుండి బోధన్ వచ్చేఎన్ హెచ్65 ప్రధాన రహదారిలో నాగన్ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి కారు బోల్తా పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ఒకరే ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనికి గల కారణం అతివేగం, నూతనంగా నిర్మింపబడుతున్న ప్రధాన రహదారిపై మలుపు దారులలో ఎలాంటి హెచ్చరిక లేదా సూచిక బోర్డులు లేకపోవడమే ఇందుకు కారణం అని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా ప్రధాన రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు అన్నారు.
