26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బడ్జెట్ పై కాంగ్రెస్ నాయకుల మతిలేని మాటలు

Must read

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2047 నాటికీ వికసిత్ భారత్ కల సాకారానికి ముందడుగే ఈ బడ్జెట్ అన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్ములన కోసం, పేద,మధ్యతరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ద్యేయంగా,అన్ని రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా బడ్జెట్ ను రూపొందించడం  జరిగిందన్నారు.

మధ్యతరగతి ఉద్యోగులకు ఊరట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మధ్యతరగతి ఉద్యోగులకు వ్యక్తిగత పన్ను చెల్లింపులో 12.75 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.

 పరిశ్రమల అభివృద్ధి : సూక్ష్మ, చిన్న తరహా, పరిశ్రమల ధ్వరా మహిళ సాధికారాతకు ప్రస్తుతంకోటికి పైగా ఎంఎస్ఎంఈ ల ద్వారా 7.5 కోట్ల మందికి పైగ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. వచ్చే ఐదు ఏళ్లలో 1.5 లక్షల కోట్లకు పైగ రుణ సహాయం అందనుందన్నారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల పరిమితి ఐదు కోట్ల నుండి పది కోట్లకు పెంచడం జరిగిందన్నారు. స్టార్టప్ లకు పది కోట్ల నుండి ఇరవై కోట్లకు పరిమితి పెంచడం జరిగిందన్నారు.

 రైతుల సంక్షేమం :కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డుల ధ్వరా తక్కువ వడ్డీకె ఇచ్చే రుణ సదుపాయం 3 లక్షల నుండి 5 లక్షల వరకు పెంచడం జరిగిందని దీని ధ్వరా 7.7 కోట్ల రైతులకు లబ్ది చేకూరానున్నట్లు తెలిపారు. పత్తి ఉత్పత్తిని పెంచడానికి ప్రత్యేక మిషన్ ఏర్పాటుతో పాటు చిరు ధాన్యల స్వయం సమృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

విద్య,వైద్యం పై ఫోకస్ : ప్రభుత్వ పాఠశాలలో 50 వేల అటల్  లాబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు విద్య రుణాలు తీసుకున్న వారికీ 10 లక్షల వరకు టీసీఎస్ (టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) ను తొలగించిందన్నారు. వైద్య రంగంలో రాబోయే 5 ఏళ్లలో 75 వేల మెడికల్ సీట్ల అందుబాటులో తీసుకొస్తాం అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్ చికిత్సకు డేకేర్ కేంద్రాలను ఏర్పాటుకు కేంద్రం పునుకుందన్నారు.

 చేతివృత్తుల రంగాలకు చేయూత : బొమ్మల తయారీ రంగాన్ని ప్రోత్సాహిస్తూ నైపుణ్యం కలిగిన బొమ్మల తయారీ పెంపోందిస్తూ ప్రపంచంలో అతిపెద్ద బొమ్మల తయారీ దేశాంగా తయారు చేసే లక్ష్యం దిశగా అడుగులు వేస్తుందన్నారు. చెప్పుల తయారీకి సంబంధించి యంత్రాలు, తోళ్ల రహిత చెప్పుల తయారీకి చర్యలు తీసుకోవడం ధ్వరా 22 లక్షల మంది ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఒక కోటి గిగ్ వర్కర్లకు ఆరోగ్య భీమా వర్తించేల పథకం తీసుకురావడం జరిగిందన్నారు. అన్ని రాష్ట్రాల మౌలిక సదుపాయాలకు లక్షన్నర కోట్లు వడ్డీ రహిత రుణాలు అందించనున్నాం అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకొని వారు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజల గుండెల్లో నిలిచిపోయేల ఉందన్నారు అది జిర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు విషం చీమ్ముతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి కమీషన్లకు ఎగపడి దోచుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇస్తది కాని దోచుకోవడానికి, దాచుకోవడానికి నిధులు ఇవ్వదు అని ఏద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ,మండల అధ్యక్షులు నాగరాజు, బీజేపీ నాయకులు మల్లేష్ గుప్తా, నాయకులు ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Nonsense words of Congress leaders on the budget

More articles

Latest article