25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సమన్యాయం కోసమే ఎస్.సి వర్గీకరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ సమన్యాయం కోసమేనని నిజామాబాద్ జిల్లా మాదిగ లాయర్స్ ఫెడరేషన్ నేతలు పడిగల వెంకటేష్, ఆశ నారాయణ,దీపక్,అన్వేష్,సుజిత్ బాలేకర్,సలహాదారు దేవదాసు చందక్ ఎస్.సి వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ శమీమ్ అక్తర్ కు విన్నవించారు. కమిషన్ జిల్లా కలెక్టరేట్ లో వినతులు స్వీకరించిన నేపథ్యంలో వారు రెండు పేజీల వినతిపత్రాన్ని సమర్పించారు. భారత రాజ్యాంగమే పౌరుల మధ్య సమన్యాయానికి పూచీకత్తుగా ఉన్నదని వారు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్థిక,సామాజిక న్యాయానికి ఆద్యుడని అన్నారు. భారత సుప్రీంకోర్టు ఎస్.సి వర్గీకరణకు ఆమోదముద్ర వేసిందని తెలుపుతు,బిసి వర్గాలలో ఎ. బి.సి.డి వర్గీకరణ ఉన్న విషయాన్ని వారు కమిషన్ చైర్మన్ కు ఏకరువు పెట్టారు. ఎస్. సి వర్గీకరణతోనే షెడ్యూల్ కులాలలో వెనుకబడిన వారికి కూడా రిజర్వేషన్ ఫలాలు అంది అంబేద్కర్ కోరుకున్న సమన్యాయం చేరుతుందని వారు తెలిపారు

More articles

Latest article