24.7 C
Hyderabad
Monday, August 3, 2026

చీనూర్ లో ఘనంగా గీతా జ్ఞాన యజ్ఞం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : గీతా జయంతిని పురస్కరించుకొని మండలంలోని చీనూర్ గ్రామంలోని గోపాల స్వామి ఆలయంలో గురువారం ఘనంగా వాసుదేవ కుండాత్మక గీత జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించారు. వేద బ్రాహ్మణులు గోపాల చారి గీత జయంతి సందర్భంగా బుధవారం, గురువారం రెండు రోజులపాటు భగవద్గీత లోని 18 అధ్యాయాలు గీతా పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా చీనూర్ గ్రామంతో పాటు వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోపాలస్వామి ఆలయంలో వాసుదేవాయ నమః అంటూ పారాయణం చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

More articles

Latest article