27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం కప్ క్రీడలు ప్రారంభించిన తహసీల్దార్

Must read

📰 Generate e-Paper Clip

పిట్లం, బతుకమ్మ : పిట్లం మండల కేంద్రంలో బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం  సీఎం కప్ క్రీడలను తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ ప్రారంభించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి సీఎం కప్ క్రీడీ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, నేషనల్ స్థాయికి వెళ్తారని ఈ క్రీడలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి, సొసైటీ చైర్మన్ నాగిరెడ్డి,ఎంపీడీవో కమలాకర్, ఎంఈఓ దేవి సింగ్, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పీఈడీలు పాల్గొన్నారు.

Tehsildar who started CM cup games

More articles

Latest article