23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి  పీఎస్ పరిధిలో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో కేంగార్ల మల్లయ్య(70) జీవిస్తున్నాడు. మల్లయ్య గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతని భార్య గత మూడు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి తన రూంలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కూతురు కేంగార్ల నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More articles

Latest article