27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎం రేవంత్ రెడ్డి మాటలు అబద్ధం అనే మాట కూడా ఆత్మహత్య చేసుకునేలా ఉంది

Must read

📰 Generate e-Paper Clip

. . . రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

. . . మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే అబద్ధపు మాట కూడా ఆత్మహత్య చేసుకునేలా ఉందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోజుకో అబద్ధపు అసత్యపు ప్రకటనలు చేస్తూ కాలం వెల్లడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయన విమర్శించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  ఆయన మాట్లాడుతూ రుణమాఫీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీమంత్రి,బాల్కొండ ఎమ్కెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి మాటలు చూసి అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకునేలా ఉందంటూ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి రూ.31వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలాలు పలికారన్నారు. కానీ చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కిడికి వెళ్లినా రుణమాఫీపై దేవుళ్లపై ఒట్లు పెడుతూ అబద్ధాలు చెప్పారన్నారు. రాష్ట్రంలో ఇంకా 14 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని పేర్కొన్నారు. సగం పనులు చేసి హరీశ్రావును రాజీమానా చేయాలనడం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీ కొందరికే ఇచ్చి.. రైతు బంధు నిలిపివేశారని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, సిర్ఫ రాజు, సత్యప్రకాష్, రవిచందర్, సుజిత్ ఠాకూర్. మురళి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article