ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ లోని శ్రీ భాషిత పాఠశాలకు శనివారం,రోజున హైదరాబాదులోని హైటెక్స్ లో, బ్రిన్ఫీడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైటెక్ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాలకు బెస్ట్ అకాడమిక్ ఎక్సలెన్స్, కెరియర్ గైడెన్స్ ఎక్సెలెన్స్ ఇన్ పేరెంట్ ఎంగేజ్మెంట్ నకు అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి ఏటా జరిగే ఈ అవార్డుల ప్రధాన ఉత్సవంలో శ్రీ భాషిత కు అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అని శ్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ పోలపల్లి సుందర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి హాజరై ఆయన చేతుల మీదుగా కరస్పాండెంట్ కు అవార్డు ప్రధానోత్సవం చేశారు. ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని దీనికి కృషి చేసిన సహకరించిన పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ఈ అవార్డు అంకితం చేస్తున్నానని పాఠశాల కరస్పాండెంట్ సుందర్ తెలిపారు.

