26.6 C
Hyderabad
Monday, August 3, 2026

2000-2001 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Must read

📰 Generate e-Paper Clip

ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలంలోని  2000-2001 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుదవారం మండల కేంద్రంలో నిర్వహించారు. మొదటగా  చనిపోయినటువంటి  వ్యక్తులను గుర్తు చేసుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం అందరూ ఒకే చోట చేరి ఒక్కొక్కరుగా మాట్లాడుతూ…. ప్రస్తుతం వారి కుటుంబం,  వారు ఉద్యోగం,పనుల గురించి చర్చించుకుని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే తమకు విద్య నేర్పిన గురువులను గుర్తు చేసుకున్నారు. చివరిగా భోజనం ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి బంతి భోజనం చేసి ఆడి,పాడి ఆనందంగా గడిపారు.

More articles

Latest article