29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సారూ.. కనికరించండి

Must read

📰 Generate e-Paper Clip

మానసిక వైకల్యంతో బాధపడుతున్న తమ 12ఏళ్ల కూతురికి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన మహేశ్, సాయవ్వ దంపతులు అధికారులను కోరుతున్నారు. తమ కూతురు అవంతికృప(12) మానసిక వైకల్యంతో జన్మించిందని, గత ఏడెనిమిదేళ్లుగా పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్ కు తమ కూతురితోపాటు వచ్చి  పింఛన్ కోసం దరఖాస్తు అందజేశారు. ఇప్పటికే తమకు జన్మించిన ఇద్దరు పిల్లలు అనారోగ్యంతో చనిపోయారని, ఉన్న కూతురూ మానసిక వైకల్యంతో బాధపడుతోందని ఆ తల్లిదండ్రులు తెలిపారు.

– నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

More articles

Latest article