27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దేవగిరి ఎక్స్ ప్రెస్ లో నల్ల బెల్లం పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ క్రైo : నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, నిజామాబాద్ రైల్వే పోలీసులు, నిజామాబాద్ ఎక్సైజ్ అధికారులు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఆదివారం నిజామాబాద్ మీదుగా ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్ప్రెస్ రైలులో సోదాలు నిర్వహించారు. ఒక రైల్వే భోగిలో 120 కిలోల నల్ల బెల్లం, 250 కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. రెండు ముడి పదార్థాలతో నాటుసారా లేదా గుడుంబా తయారు చేస్తారని పోలీసులు తెలిపారు. ముడి సరుకును తరలిస్తున్న వారికోసం గాలించగా ఎవరు దొరకలేదని తెలిపారు. వరంగల్ నుంచి ముడి సరుకులు రవాణా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు ఎస్ హెచ్ఓ దిలీప్ తెలిపారు.

More articles

Latest article