నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్ కు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అల్వాల సాత్విక డెంగ్యూతో మృతి చెందింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని విజయ్ పబ్లిక్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న సాత్వికకు జ్వరం రావడంతో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందింది. అయితే విద్యార్థిని డెంగ్యూతో మరణంపై మలేరియా అధికారులను వివరణ కోరగా తమ వద్దకు రిపోర్టు కాలేదని తెలిపారు. సీజనల్ వ్యాధుల సమయం కావడంతో ప్రైవేట్ లో చికిత్స పొంది ఉండవచ్చని తెలిపారు.