వెబ్ న్యూస్, బతుకమ్మ : రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆర్ఆర్బీ ఓ ప్రకటనలో తెలిపింది. టెన్త్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా ఇంజినీరింగ్ లో డిగ్రీ/ డిప్లొమో పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొంది. అభ్యర్థుల వయస్సు ఈఏడాది జూలై నాటికి 18-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ మే 11 కాగా, జనరల్/ ఓబీసీలకు దరఖాస్తు ఫీజు రూ.500, మిగితా వారికి రూ. 250గా ఉంది. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www,indianrailways.gov.in ని సందర్శించవచ్చు.