Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 January 2026, 6:07 pm Posted by : ramakrishna

99 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ సరిహద్దులలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 12 నుండి 17 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 99 కేసుల నమోదు చేయడం జరిగింది. వారిని కోర్టు లో హాజరు పరచగా వీరికి రూ: 5,80,000/-  జరిమానా విధించడం జరిగింది. ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, వాహనాదారులు వాహనానికి సంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరని ఐపీఎస్ సాయి చైతన్య అన్నారు.