. .. 25 న వారికి అవకాశం ఇచ్చి కొనసాగించాలని ఉత్తర్వులు
. . . వైద్య విద్యా అధికారుల వింత నిర్ణయం
. .. డీఎంఈ నిర్ణయం పై విమర్శలు
హైదరాబాద్, బతుకమ్మ :
రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ, వరంగల్ కేఎంసీతోపాటు ఇతర బోధనాసుపత్రుల్లో పని చేస్తూ ఏడాది నుంచి విధులకు గైర్హాజరవుతున్న 94 మంది వైద్యులను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్టు మంగళవారం వైద్య విద్య సంచాలకులు నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా విధులకు హాజరుకాని 115 మంది వైద్యులకు గతంలోనే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో 21 మంది విధుల్లో చేరారు. మిగిలిన 94 మందిని తొలగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే వీరికి మరో అవకాశం ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించడంతో వేచిచూసి కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 23 న వెలువడిన ఉత్తర్వులు బుధవారం నిలుపుదల చేయడం పై విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోధనాసుసుపత్రులలో పని చేస్తున్న చాలా మంది ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ లు విధులకు డుమ్మా కొడుతున్నారు. సొంత ప్రాక్టీస్ కోసం డ్యూటీ లకు రావడం లేదు. గత ప్రభుత్వం లో నెలకొల్పిన మెడికల్ కాలేజ్ లల్లో బోధన అధికారులు లేరు. అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లతో తరగతులు నిర్వహించడం కొసమేరుపు. అయితే ప్రభుత్వం ఖాళీల భర్తీ చేయకుండా కాలయాపన చేయడం వలన వైద్య విద్యార్థులు తీవ్రంగా నష్ట పోతున్నారు. చాలా మంది వైద్యులు సొంత ప్రాక్టీస్ ఉన్నా చోట మాత్రమే విధులకు హాజరు అవుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు బేఖాతారవుతు న్నాయి. జి జి హెచ్ అనుబంధంగా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించిన వైద్యులు లేరని సాకుతో దానిని తెరవడం లేదు. చాలామంది పిల్లల వైద్యులు, ఉన్నప్పటికీ ఎం సి హెచ్ గుదిబండగా మారుతుందని దానిని ప్రారంభించడం లేదని ఆరోపణలున్నాయి. నిజామాబాద్ జి జి హెచ్ లో పనిచేస్తున్న చాలామంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కోట్ల రూపాయలు దవాఖానాలు కట్టుకున్న వారు నిత్యం విధులకు హాజరు కాకుండా దుమ్మాల కొడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్రం లో 115 మంది వైద్యులు మాత్రమే విధులకు డుమ్మా కొడుతున్నారని నోటీసులు ఇవ్వడం పై అనుమానాలు ఉన్నాయి. కొందరు వైద్యులు బయో మెట్రిక్ అటెండెన్స్ ను నిర్వీర్యం చేసారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్, వరంగల్ నగరాలను మించి ప్రైవేట్ ప్రాక్టీస్ ఆసుపత్రులకు నిజామాబాద్ కు పేరుంది. ఇక్కడ వైద్యులు చాలా మంది ఉదయం… సాయంత్రం అటెండన్స్ వేసుకొని సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు… కొందరు ఉదయం వాకింగ్ వెళ్లిన సమయం లో హాజరు వేసుకొని డుమ్మాలు కొట్టడం గమనార్హం.. కొందరూ కేవలం ఎస్ ఆర్ లు… జూడా లపై పెత్తనం చేస్తూ విధులకు హాజరు కావడం లేదు.. పొరుగున ఉన్నా జగిత్యాల, కామారెడ్డి మెడికల్ కాలేజీ అధికారులు బయో మెట్రిక్ అటెండన్స్ ను మాయ చేసి నిజామాబాద్ లో సొంత ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిలో చాలామందికి నోటీసులు రాకపోవడం అనుమానాలకు తావిస్తుంది.