Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 August 2025, 9:22 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 91మందికి శిక్షలు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి వాహనం నడిపిన 91మందికి శుక్రవారం న్యాయమూర్తులు జైలు శిక్ష విధించారు. వీరిలో 16 మందికి ఒక  రోజు జైలు శిక్ష రూ.1100 జరిమానా, ఒక్కరికి     2 రోజుల  జైలు శిక్ష రూ.200 జరిమానా, 74 మందికి ఒక్కొక్కరికి రూ.1100 జరిమానా విధించారు.వీరిలో ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 10 మందికి, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురికి, లింగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరికీ, నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి ఒక్కరోజు జైలు శిక్షతో పాటు రూ.1100 జరిమానా, దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరికి రెండు రోజులు జైలు శిక్షతో పాటు రూ.200 జరిమానా  విధించారు.