Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 8:22 pm Posted by : ramakrishna

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో 91 కేసులు నమోదు

 

. . . 11 మందికి జైలు శిక్షలు

 

. . . జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలను రక్షించడం లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం నిర్వహించిన తనిఖీలలో 91 కేసులు నమోదైనట్టు వారు తెలిపారు. వీరికి రూ.1,13,600 జరిమానా విధించారని, ఏడుగురికి ఒక రోజు, ఇద్దరికి రెండు రోజులు, మరో ఇద్దరికి మూడు రోజుల జైలు శిక్షలు విధించినట్టు ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని, ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు తప్పవని, ఇది వ్యక్తిగత భవిష్యత్తు, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, సురక్షిత ప్రయాణాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.

 

91 cases registered in drunk and drive inspections