బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని బోధన్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వారు పేకాటలో నిమగ్నమై ఉన్న సమయంలో పోలీసులు దాడి చేసి, వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం వారికి సంబంధించిన కేసును జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి ప్రతీ ఒక్కరికీ రూ.2000 జరిమానా మరియు ఒక రోజు జైలు శిక్ష విధించారని బోధన్ ఎస్ఎచ్ఓ వెంకటనారాయణ తెలిపారు.