9మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో పలువురు హెడ్​ కానిస్టేబుళ్లకు పదోన్నతి ​ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. తొమ్మిది మంది హెడ్​ కానిస్టేబుళ్లకు అసిస్టెంట్​ సబ్​ ఇన్​స్పెక్టర్లుగా పదోన్నతి కల్పించారు. ప్రమోషన్​ పొందిన వారిలో హెడ్​ కానిస్టేబుళ్లు రియాజుద్దీన్​, డి.జక్రయ్య, కె.పరమేశ్వర్​, పి.వసంత్​రావు, కె.అరుణ కుమారి, జి.అనురాధ, జీవీ రమణేశ్వరి, ముంతాజ్​ బేగం, సతీశ్​కుమార్​ ఉన్నారు. ప్రమోషన్​ పొందిన వారు 15 రోజుల్లో కొత్త స్టేషన్​లో రిపోర్ట్​ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.