. . . రూ. 28,140 నగదు, మొబైల్ ఫోన్ లు స్వాధీనం
నందిపేట్, బతుకమ్మ :
నందిపేటలోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై పోలీసులు శనివారం ఆకస్మిక దాడి చేశారు. నమ్మదగిన సమాచారంతో ఎస్సై కె.వినయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 9 మంది పేకాట రాయుళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 28,140 నగదు, 7 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు.